EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

వి.కోట మండలంలోని కొంగాటం కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని వినతి.. అందజేసిన కిరణ్ ఫౌండేషన్ అధినేత కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి..

📰 Generate e-Paper Clip

పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 06:

 

గతంలో కుప్పం నియోజకవర్గంలోని 10 పంచాయతీలను ప్రత్యేక మండలంగా గుర్తించాలి.. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేసిన కిరణ్ ఫౌండేషన్ అధినేత కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి. పలమనేరు నియోజకవర్గం పరిధిలోని అత్యధిక జనాభా కలిగిన వి.కోట మండలాన్ని రెండుగా విభజించి కొంగాటం కేంద్రంగా ప్రత్యేక మండల ఏర్పాటు చేయాలని కోరుతూ.. కిరణ్ ఫౌండేషన్ అధినేత, పారిశ్రామికవేత్త కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సోమవారం పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సోమవారం సాయంత్రం పలమనేర్ లోని ఆయన కార్యాలయంలో తన అనుచరులతో కలిసి పుష్పగుచ్చనందించి ఎమ్మెల్యేను కలిసిన ఆయన వి. కోట మండలాన్ని విభజించి కొంగాటాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. సుమారు లక్ష జనాభా ఉన్న వీకోట మండలాన్ని యధాప్రకారం కొనసాగించడం వల్ల పరిపాలన సౌలభ్యంగా ఉండదని, ప్రజల సౌకర్యం మండలాన్ని రెండుగా విభజించాలని డిమాండ్ చేశారు. వారి విన్నపని స్వీకరించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సాధ్యాసాధ్యులను పరిశీలించి ప్రజాభీష్టం మేరకు మండలాల పునర్ విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. ఉండటం కేంద్రంగా మండలం ఏర్పాటు చేసే విషయమై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!