EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

విజయవాడలో కుప్పం నియోజకవర్గ సమీక్షా సమావేశం  11వ క్లస్టర్ అభివృద్ధిపై చర్చ

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 06:

 

రాష్ట్రముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కుప్పం నియోజకవర్గ నాయకుల సమీక్షా సమావేశంలో కుప్పం పట్టణం 11వ క్లస్టర్ ఇన్‌చార్జి కన్నన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కన్నన్ ప్రత్యేకంగా కలిసి, 11వ క్లస్టర్ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రాంతీయ సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అందాల్సిన సేవల మెరుగుదలపై వివరంగా చర్చించామని ఆయన వెల్లడించారు. అనంతరం పార్టీ బలోపేతంపై కూడా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. 11వ క్లస్టర్ పరిధిలో ను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలను పార్టీ అధినేత వివరించారని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కన్నన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసి, కుప్పం నియోజకవర్గంలో పార్టీ బలాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సమావేశం కుప్పం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి కీలకంగా మారుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!