EPAPER
Thursday, August 20, 2026
Google search engine

వసనాడు చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

కు

ప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 01:

 

చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు గ్రామ పరిధిలోని చెరువులో బుధవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న కుప్పం అర్బన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతనికి సంబంధించిన సమాచారం ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!