
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 07:
కుప్పం మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీనాయకుడు టైర్ బాలు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటనచోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ప్యాలెస్ రైల్వే స్టేషన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఆయనకు గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు బాలు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే కుప్పం నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు జాకీర్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్ దాము ఆసుపత్రికి చేరుకొని బాలును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలు కూడా ఆసుపత్రికి చేరుకొని బాలు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Recent Comments