
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూలై 30:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న “రెండు సంవత్సరాల నమ్మకం – అభివృద్ధి & సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని మునసాపురం 23వ వార్డులో బుధవారం డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెస్కో చైర్మన్ వి.జి. ప్రతాప్ కుమార్, కాడా అడ్వైజర్ ఎస్. రాజ్ కుమార్, మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొని ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు నిర్వాహకులు తెలిపారు.


Recent Comments