శాంతిపురం,చిత్తూరు ఎక్స్ప్రెస్,అక్టోబర్ 01:
స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు-2026 లో భాగంగా చిత్తూరు జిల్లాలో స్వచ్ఛ గ్రామ పంచాయతీగా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు గ్రామ పంచాయతీఎంపికైంది. జిల్లా వ్యాప్తంగా 622 పంచాయతీల మధ్య జరిగిన పోటీలో ఇంటింటా చెత్త సేకరణ, తడి-పొడి చెత్త విభజన, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధుల పరిశుభ్రత అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పంచాయతీ అవార్డుకు ఎంపికైనట్లు ఎస్ఏఎస్ఏ పోర్టల్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతిపురం మండల ఎంపీడీవో ఏ.పీ.ఆర్. కుమార్, మరియు ప్రజలు పంచాయతీ కార్యదర్శి స్వాతి మరియు పంచాయతీ సిబ్బందిని, స్వచ్ఛ దూతలను ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో వారి కృషి అభినందనీయమని కొనియాడారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్ లో జరిగే జిల్లా స్థాయి వేడుకలో అవార్డు ప్రదానం చేయనున్నారు.


Recent Comments