తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో
ఖుషీ వైన్ షాప్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి
వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం
లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతుడి వయస్సు సుమారు 45 నుంచి50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆయన లేత నీలం రంగు ఫుల్ షర్టు, తెలుపు గీతలు, నలుపు గడులు ఉన్న లుంగీ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు మృతుడి గుర్తింపు తెలియరాలేదని వెల్లడించారు. మృతుడి ఆచూకీ వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే తొట్టంబేడు ఎస్ఐను 9440900724 , బి.ఎన్. కండ్రిగ సర్కిల్ ఇన్స్పెక్టర్ను 9440796763 నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



Recent Comments