EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ముఖ్యమంత్రి సి.బి.ఎన్,  76వ జన్మదినోత్సవం జరిపిన  తెలుగు తమ్ములు. 

📰 Generate e-Paper Clip

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

వి.కోట ఎన్టీఆర్ సర్కిల్ లో మండలంలోని తెలుగు తమ్ముళ్లు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున పాల్గొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని భారీ కేక్ కట్ చేసి అనంతరం విచ్చేసిన ప్రజలకు భోజనాలు పంచి పెట్టినారు. సిబిఎన్ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రక్తదానం చేసినారు. ఈ సందర్భంగా వీకోట కు ఆనుకొని ఉన్నటువంటి పట్రాపల్లి చెరువు నుండి వీకోట మీదుగా కీలపల్లి చెరువు లోనికి అనుసంధానంగా ఉన్నటువంటి సప్లై ఛానల్ ను పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సిబిఎన్ ఆశీస్సులతో,సిమెంట్ కాంక్రీట్ తో నిర్మితమవుతున్నటు వంటి పనులను కూటమే ప్రభుత్వ నాయకులు సందర్శించి పనిలో నాణ్యత గురించి పరిశీలించి, గుత్తేదారుతో మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో వేగవంతం చేయాలని సలహా ఇచ్చినారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ డైరెక్టర్ రంగనాథ్, మండల తెదేపా అధ్యక్షుడు రాంబాబు,నాగరాజు, సుబ్బన్న, గజేంద్ర ధీరజ్,శబరిష్ , సోమశేఖర్,తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!