EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

మహిళ భద్రతే లక్ష్యం మీ భద్రత మా బాధ్యత అని ఎస్‌ఐ ప్రియాంక భరోసా

📰 Generate e-Paper Clip

శ్రీ సిటీ,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 28:

 

తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో మహిళ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప పోలీసు అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఎస్‌ఐ ప్రియాంక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక సంస్థలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలకు భద్రతపై పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రియాంక మాట్లాడుతూ మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదని, పోలీసు విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అవసరమైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలపై జరిగే వేధింపులు, అక్రమాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని, చట్టం వారికి సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని వివరించారు. భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!