EPAPER
Sunday, October 18, 2026
Google search engine

బి.ఆర్.డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో  అత్యాధునిక రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు

📰 Generate e-Paper Clip

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 24:

 

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బిఆర్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా. బి.ఆర్. సురేష్ బాబు నేతృత్వంలో ఒకే రోజులో మూడు ప్రధాన శస్త్రచికిత్సలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. కుప్పం పట్టణానికి చెందిన 58 ఏళ్ల విజయలక్ష్మికి రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించగా, రామకుప్పం మండలం బీడి చేనుకు చెందిన 65 ఏళ్ల కుప్పుస్వామికి మోకాలి మార్పిడి చికిత్స చేశారు. అలాగే కేజీఎఫ్‌కు చెందిన 53 ఏళ్ల సౌందర్ రాజ్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్సల్లో ఆసుపత్రి చైర్మన్ డా. సురేష్ బాబు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ లోకేష్ గౌడ, రోబోటిక్ సర్జన్ డా. సతీష్, అనస్తీషియా వైద్యుడు డా. సిద్దేశ్వర్‌తో పాటు ఓటీ టెక్నీషియన్లు ధనశేఖర్, చంద్రశేఖర్, దివాకర్, కార్తీక్, మనోహర్, శ్వేత పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!