వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 13:
మండల పరిధిలోని పేద ముస్లిం మైనార్టీలకు స్థానిక అఖిల్ ట్రేడింగ్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను అందజేశారు. రాబోవు రంజాన్ పర్వదినాన ముస్లిం మైనార్టీ లందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని తోపాను అందజేస్తున్నట్లు ట్రేడర్స్ యజమాని అఖిల్ తెలిపారు. సుమారు 500 రూపాయలు విలువ చేసే తొమ్మిది రకాల వస్తువుల బ్యాగ్ ను దాదాపు 500 మంది ముస్లిం మైనార్టీలకు శుక్రవారం తమ శక్తి మేరకు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. రాబోవు కాలంలో తమ అఖిల్ ట్రేడింగ్ కంపెనీ తరఫున మరికొంతమంది పేద ముస్లిం మైనార్టీలకు సహకారం అందించేందుకు కృషి చేస్తామని యజమాని అఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు జాకీర్,అమానుల్లా, పజిల్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments