
పెనుమూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 02:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విబీజీ రంగీ కార్యక్రమాన్ని పెనుమూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో గురువారం ఘనంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ప్రారంభించిన కార్యక్రమానికి అనుసంధానంగా మండలంలోని రామకృష్ణాపురంలో కొబ్బరి చెట్ల పెంపకం పనులను ఉపాధి హామీ కూలీలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో కొత్త విబీజీ రంగీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కూలీలకు విబీజీ రంగీ పథకం ముఖ్యాంశాలను వివరించారు. ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం, రోజువారీ కూలీని రూ.312కు పెంచడం, వ్యవసాయ సీజన్‌లో ఉపాధి హామీ పనులకు విరామం కల్పించడం, పనులు పూర్తిచేసిన కూలీలకు 15 రోజులలోపు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రారంభించిన విబీజీ రంగీ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం (లైవ్ టెలికాస్ట్) ద్వారా కూలీలకు వీక్షింపజేశారు. కార్యక్రమంలో ఉపాధి హామీ శాఖ సిబ్బంది, గ్రామస్థులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


Recent Comments