
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే13:
చిత్తూరుజిల్లా కుప్పంలోని పీఈఎస్‌ఐఎం నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఎన్.కె.సుబ్రహ్మణ్య తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం “సాధికారత పొందిన నర్సులు ప్రాణాలను కాపాడతారు” అనే థీమ్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. అభిరామి మాట్లాడుతూ, నర్సులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డేనియల్ అరుల్ కుమార్ మాట్లాడుతూ, నర్సింగ్ విద్యార్థులు కరుణ, నిబద్ధత, మానవతా విలువలను పెంపొందించుకుని సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు,అవగాహన కార్యక్రమాలు, నైతిక విలువలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే సమాజంలో నర్సుల పాత్ర, వారి ఆరోగ్య సేవల ప్రాముఖ్యతపై చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ వేడుకలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అభిరామి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డేనియల్ అరుల్ కుమార్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొననున్నారు.


Recent Comments