EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రేణిగుంటలో ప్రారంభం కానున్న రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ … మహిళల ఆత్మరక్షణే లక్ష్యమన్న జనసేన నాయకులు మిథున్ శాలి

📰 Generate e-Paper Clip

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 26 :

 

రేణిగుంట ఎన్టీఆర్ సర్కిల్‌లోని బషీర్ కాంప్లెక్స్‌లో రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ ను జనసేన నాయకుడు మిథున్ శాలి ఆధ్వర్యంలో జూలై 29 ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా మిథున్ శాలి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌పై చూపుతున్న ఆసక్తి, క్రమశిక్షణ,ఆత్మరక్షణపై ఆయన ఇస్తున్న ప్రాధాన్యతతో స్ఫూర్తి పొంది ఈ టెక్వాండో క్లబ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా నేటి పరిస్థితుల్లో ప్రతి మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ నైపుణ్యాలు ఎంతో అవసరమని,అదేవిధంగా చిన్నారులు,యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు.క్లబ్ వ్యవస్థాపకుడు,కోచ్ వై.అవినాష్ ఆధ్వర్యంలో టెక్వాండోతో పాటు సెల్ఫ్ డిఫెన్స్,నన్‌చాకు,సిలంబం, ఉరుమి వంటి శిక్షణలు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విజయ్ ఆనంద్, జొన్నలగడ్డ మురళి,శ్రీనివాసులు,టి మణికంఠ, జ్యోతి కుమార్,చిన్నా,జాన్,మహేష్,క్రీడాకారులు,యువత పాల్గొని క్లబ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!