EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పదవ తరగతి ఫలితాల్లో ఖాన్స్ రెయిన్బో స్కూల్ మండలంలో నెంబర్ వన్ విద్యార్థుల మెరుగైన ప్రతిభతో స్కూల్ రికార్డు ఫలితాలు

📰 Generate e-Paper Clip

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్‌ 30 :

 

రేణిగుంట పట్టణంలోని ఖాన్స్ రెయిన్బో స్కూల్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. పాఠశాల విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం దక్కించుకోవడంతో స్కూల్‌కు మంచి పేరు తీసుకువచ్చారు. ఈ ఫలితాల్లో దైదీప్య జస్మితా జి,బాను జి ఇద్దరూ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.మోనిషా రెడ్డి సి,హఫ్సా షేక్,కీర్తిక బి 590 మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని పొందారు. రీతిక 589 మార్కులు సాధించి తృతీయ స్థానాన్ని దక్కించుకుంది.విద్యార్థుల ఈ అద్భుత ఫలితాలపై పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.క్రమశిక్షణతో కూడిన బోధన,విద్యార్థుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కరస్పాండెంట్ అత్తా ఉల్లా ఖాన్ తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ విద్యార్థులను అభినందిస్తూ,భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.అదేవిదంగా 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రకటించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!