EPAPER
Friday, February 20, 2026
Google search engine

నులి పురుగుల నివారణకు కృషిచేయాలి: జాకీర్

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 17:

 

కుప్పంపట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల మరియు టైలర్ హైస్కూల్ లో మంగళవారం జాతీయనులిపురుగుల నివారణదినోత్సవం పురస్కరించుకొని నులిపురుగుల నివారణ మాత్రలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా టిడిపి కుప్పం నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాకీర్ అహ్మద్ మాట్లాడుతూ.. నులి పురుగుల నివారణ మనందరి బాధ్యత అని అన్నారు.వీటివల్లశరీరఎదుగుదల  తోపాటు మనిషిలోని రోగనిరోధకశక్తి కూడా తగ్గేప్రమాదం ఉందన్నారు. చెప్పులులేకుండా నడవడం,మట్టిలో ఆడటం, చాక్‌పీసులు,బలపాలు,మట్టి తినడంవల్ల పిల్లలశరీరంలో నులిపురుగులు తయారవుతాయని అన్నారు. ఇవి పేగుల్లో ఉండి రక్తాన్ని పీల్చుకుంటాయన్నారు.నులిపురుగల నివార ణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం,చల్లార్చిన నీటిని తాగడం,పండ్లను,కూరగాయలను నీటితో కడిగిన తరువాత నే తినడం తరుచూచేతులను శుభ్రంచేసు కోవడం వంటివి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్యసిబ్బంది,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!