EPAPER
Sunday, October 18, 2026
Google search engine

దర్గా అభివృద్ధికి గజల్ శ్రీనివాస్ రూ.1 లక్ష విరాళం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది తీరంలో వెలసిన హజరత్ జూమ్ లేషా పీర్ దర్గా అభివృద్ధికి ప్రముఖ గాయకుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత గజల్ శ్రీనివాస్ రూ.1 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్గా ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రూఫ్‌టాప్ నిర్మాణం, మరుగుదొడ్లు, భక్తులు వంటలు చేసుకునేందుకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడానికి సుమారు రూ.10 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి తన వంతు సహాయంగా తొలి విడతగా రూ.1 లక్ష విరాళాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూత నందించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి సహకారంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఈ కార్యక్రమం విజయవంతం మవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు సయ్యద్ అహ్మద్, సయ్యద్ బాబా ఫరీద్, ఉరుసు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, ఉదయ్, జమ్రుద్దీన్ భాష తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!