EPAPER
Thursday, August 20, 2026
Google search engine

టీడీపీ యువ నాయకుడు సతీష్ జన్మదిన వేడుకల్లో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

📰 Generate e-Paper Clip

ఎస్‌.ఆర్‌.పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 02:

 

ఎస్‌.ఆర్‌.పురం మండలం క్షీరసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు సతీష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు గంధమనేని నరేష్ చౌదరి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సతీష్‌తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సతీష్‌ను శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, మండల టీడీపీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, గంధమనేని రాజశేఖర్ నాయుడు ఆశీర్వాదాలు తీసుకున్న సతీష్, అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంధమనేని వాసు నాయుడు, ఆరిమాని గంగమ్మ ఆలయ చైర్మన్ జలంధర్ నాయుడు, సహకార సంఘం చైర్మన్ నిరంజన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్, టీఎస్ కుప్పయ్య, మాజీ సర్పంచ్ మనీ, పొదలపల్లి ఆనందరావు, నవీన్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!