శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి మున్సిపల్ హైస్కూల్ భాస్కర్ పేటలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో జాతీయ పతాక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప, స్కౌట్ మాస్టర్ షేక్ అజారుద్దీన్ విద్యార్థులకు జాతీయ పతాక ప్రాముఖ్యతను వివరించారు. మన త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదని, అది భారతీయుల ఐక్యత, స్వేచ్ఛ, త్యాగం, గౌరవానికి ప్రతీక అని అన్నారు. జాతీయ పతాకాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తూ దేశ గౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గైడ్ క్యాప్టెన్ నాగజ్యోతి, నాగమ్మని ఉపాధ్యాయురాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో విజయవంతంగా జరిగింది.




Recent Comments