EPAPER
Sunday, October 18, 2026
Google search engine

చేమూరు చెరువులపై ‘పెద్దల కన్ను’చెరువు గర్భాలు హాంఫట్‌.. సర్వే మాత్రం సగంలోనేఆక్రమణల ఆరోపణలపై అధికారుల నిర్లక్ష్యం  ఎందుకుఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారు

📰 Generate e-Paper Clip

తొట్టంబేడు మండలం చేమూరులో చెరువుల పరిరక్షణపై ఇప్పుడు పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే చింతల చెరువు, రాయల చెరువు, ఎద్దల చెరువులు క్రమంగా కుచించుకుపోతున్నాయన్న రైతుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చెరువులను కాపాడాల్సిన యంత్రాంగం ఉండగా.. చెరువు గర్భాల్లో ఆక్రమణలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు రావడం, హద్దులు తేల్చాల్సిన జాయింట్‌ సర్వే కూడా పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.చెరువులు ఆక్రమిస్తుంటే  అధికారులు ఏం చేస్తున్నారు
చేమూరులోని .. సర్వే నంబర్‌ 163/ఏ లోని సుమారు 90 ఎకరాల చింతల చెరువులో 40 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్‌ 239/ఏ లోని సుమారు 60 ఎకరాల రాయల చెరువులో 30 ఎకరాల మేర ఆక్రమణలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు సర్వే నంబర్‌ 200/ఏ లోని సుమారు 40 ఎకరాల ఎద్దల చెరువు గర్భం పూడ్చివేయబడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంత పెద్ద స్థాయిలో ఆరోపణలు వస్తున్నా.. చెరువుల అసలు విస్తీర్ణం ఎంత  ప్రస్తుతం ఎంత మిగిలింది ఆక్రమణకు గురైన భూమి ఎంత అన్న విషయాలను అధికారులు బహిరంగంగా వెల్లడించకుండా ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నారని రైతులంటున్నారు.
జాయింట్‌ సర్వే ఏమైంది చెరువుల ఆక్రమణలపై రైతులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినందుకు  చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ ఆలస్యమైందని రైతులు ఆరోపిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డిని రైతులు కలిసి సమస్యను వివరించడంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో జాయింట్‌ సర్వేకు ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నెల 26న రాయల చెరువులో అధికారులు సర్వే చేపట్టారు.
అయితే సర్వే పూర్తిగా ముగియకుండానే అధికారులు వెనుదిరిగారన్న ఆరోపణలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.సర్వే ఎందుకు ఆపేశారు.సర్వేకు కొందరి నుంచి అభ్యంతరాలు వచ్చినందున . రాజకీయ ఒత్తిళ్లు ఉండడం వలన ఈ సర్వే ఆపేసారేమో తెలియదు కానీ చెరువు భూములు సర్వే చేసి హద్దులు చూపించడానికి ఈ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు  ఎవరు పరిమిషన్ ఇస్తే సర్వే చేస్తారో అర్థం కావట్లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ రంగు లేకుండా సర్వే చేయాలపెనగడం గురవయ్య, రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ..
“రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమగ్ర సర్వే నిర్వహించాలి. చెరువు పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను గుర్తించి తొలగించాలి. భావితరాల సాగునీటి వనరులను పరిరక్షించాలి. అని ఆయన అన్నారు.
తొట్టంబేడు తహశీల్దార్‌ భారతి, ఇరిగేషన్‌ ఏఈ నాగరాజును వివరణ కోరగా.. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చిన విషయం వాస్తవమేనని, జాయింట్‌ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు.

పెనగడం గురవయ్య, రైతు సంఘం నాయకులు మాట్లాడుతూరాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమగ్ర సర్వే నిర్వహించాలి. చెరువు పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను గుర్తించి తొలగించాలి. భావితరాల సాగునీటి వనరులను పరిరక్షించాలి. అని ఆయన అన్నారు.తొట్టంబేడు తహశీల్దార్‌ భారతి, ఇరిగేషన్‌ ఏఈ నాగరాజును వివరణ కోరగా.. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చిన విషయం వాస్తవమేనని, జాయింట్‌ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!