
మైదుకూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 18:
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా శనివారం మైదుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీఆర్ఓ కాలనీ (జాండ్లవరం), జగనన్న కాలనీ (జీవి సత్రం)లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అర్బన్ సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, చీటింగ్, సోషల్ మీడియా దుర్వినియోగం, పోక్సో కేసులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పేకాట, గంజాయి, అక్రమ మద్యం, నాటు సారా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, ఎలాంటి నేర కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


Recent Comments