EPAPER
Sunday, October 18, 2026
Google search engine

గొడుగుచింతలో చిన్న పాపమ్మ అంత్యక్రియలు,  ప్రముఖుల నివాళులు

📰 Generate e-Paper Clip

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 23:

 

వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు డాక్టర్ చక్రధర సిద్ధాంతి కుటుంబంలో విషాదం నెలకొంది. మడితట్టు చిన్న పాపమ్మ ఈరోజు మరణించారు. ఆమె మృతి పట్ల గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. చిన్న పాపమ్మ పార్థివదేహానికి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు గురుసాల కిషన్ చంద్, వాణిజ్య విభాగ అధ్యక్షుడు బట్టే చాణిక్య ప్రతాప్, నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యుడు చిల్లా గోవింద్ నివాళులు అర్పించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ రెడ్డి, బూత్ కన్వీనర్లు దామోదర్ రెడ్డి, మల్లికార్జున్ యాదవ్, సీనియర్ నాయకుడు తాటి రెడ్డి జయచంద్రారెడ్డి, గురవయ్య యాదవ్, జాకబ్, మురళీమోహన్ రెడ్డి, గొడుగుచింత మాజీ ఉపసర్పంచ్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు చిన్న పాపమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై చివరి వీడ్కోలు పలికారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!