శాంతిపురం , చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 29
గురు పూర్ణిమ సందర్భంగా రాళ్లబూ దుగురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాళ్లబూదుగురు యోగా విద్యార్థులు నిర్వహించారు. గ్రామ ప్రజలకు యోగాభ్యాసం నేర్పుతున్న డా. మయూర్ వి కాకు మరియు డా. సామ్య శ్రీ మయూర్ కాకు దంపతులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌని వారి శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. గురువుల ప్రాముఖ్యతను, యోగ విద్య వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.ఈ కార్యక్రమంలో యోగా పాఠశాల సభ్యులు, గ్రామ ప్రముఖులు, మహిళలు,విద్యార్థులు,పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



Recent Comments