EPAPER
Friday, September 4, 2026
Google search engine

గిరిజన విద్యార్థులకు డాక్టర్ కోటేశ్వరబాబు దాతృత్వం 43 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 29:

 

శ్రీకాళహస్తి: పేద గిరిజన విద్యార్థుల అవసరాలను గుర్తించి ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కోటేశ్వర బాబు తన ఉదారతను చాటుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని లంకమిట్ట ప్రాంతంలో సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్‌లో చదువుతున్న 43 మంది గిరిజన విద్యార్థులకు శనివారం నాణ్యమైన ప్లేట్లు, గ్లాసులను ఉచితంగా పంపిణీ చేశారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఉపయోగపడేలా ఈ సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా స్థానికులు, నిర్వాహకులు మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థుల అవసరాలను గుర్తించి సేవ చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ కోటేశ్వర బాబు సేవా నిరతిని అభినందించారు. ఆయన చేసిన ఈ చిన్న సాయం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్యూషన్ మాస్టర్ షేక్ అజారుద్దీన్, విశాలాంధ్ర రిపోర్టర్ పురుషోత్తం, మస్తాన్, శైల, పుష్ప, ధర్మమ్మ, గాయత్రి, ఢిల్లేశ్వరి, చెంచమ్మ, శ్రీలత, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!