EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

గంగమ్మ జాతరలో వైభవంగా అన్నదాన కార్యక్రమం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 15:

 

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని ముందుగా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. జాతరకు విచ్చేసిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. జాతర సందర్భంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందని స్థానికులు తెలిపారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోగా, అమ్మవారి నామస్మరణలతో ప్రాంతం మారుమోగింది. జాతరను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!