EPAPER
Sunday, October 18, 2026
Google search engine

కొత్తగా మంజూరైన రైస్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి డీఎస్‌ఓ వెంకటరాయుడు

📰 Generate e-Paper Clip

ఎస్.ఆర్.పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 29:

 

కొత్తగా మంజూరైన రైస్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చిత్తూరు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎస్‌ఓ) వెంకటరాయుడు సూచించారు. మంగళవారం ఎస్.ఆర్. పురం మండల తహసీల్దార్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉన్న రైస్ కార్డులకు మొబైల్ నంబర్లను లింక్ చేయడంతో పాటు, కొత్తగా మంజూరైన రైస్ కార్డులకు ఈ-కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రేషన్ షాపుల డీలర్లతో సమావేశం నిర్వహించి రేషన్ పంపిణీ, లబ్ధిదారులకు అందుతున్న సేవలు, ఇతర సంబంధిత అంశాలపై సమీక్షించారు. అలాగే గ్యాస్ డీలర్లతో సమావేశమై వినియోగదారులకు అందుతున్న సేవలు, గ్యాస్ పంపిణీ తీరును పరిశీలించారు. పెట్రోల్ బంక్ డీలర్లతోనూ సమావేశం నిర్వహించి పెట్రోల్, డీజిల్ పంపిణీ, వినియోగదారులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా అందించాలని డీఎస్‌ఓ వెంకటరాయుడు సంబంధిత అధికారులకు, డీలర్లకు సూచించారు. సమావేశంలో ఎస్.ఆర్. పురం తహసీల్దార్ లోకనాథ పిల్లై, మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు జయరాం నాయుడు, డీలర్ నరసింహ, పెట్రోల్ బంక్ డీలర్ గోపి, రేషన్ షాప్ డీలర్లు, గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంక్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!