EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కొణతనేరిలో నూతన అంగన్వాడి కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కొణతనేరి  గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తుల నుంచి పలు వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని తక్షణమే పరిశీలించి పరిష్కరించేలా సంబంధిత పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి త్వరలోనే కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ  గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడి భవనాన్ని కేవలం 25 రోజుల్లో రూ.5 లక్షల వ్యయంతో పూర్తి చేసి అంగన్వాడి సిబ్బందికి అందజేశామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తు నిర్లక్ష్యానికి గురైందని విమర్శిస్తూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చిన్నారుల విద్యా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సీడీపీఓ శాంతి దుర్గ, మండలాధ్యక్షుడు మునిరాజు నాయుడు, గాలి మురళి నాయుడు, గాలి చలపతి నాయుడు, తొట్టంబేడు ఎంపీడీవో సురేంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అంగన్వాడి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!