కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 25:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం లో నిర్వహిస్తున్న నాలుగురోజుల పర్యట న విజయవంతంగా కొనసాగు తోంది. పర్యటన రెండవ రోజు శాంతిపురం మండల పరిధిలోని వారి స్వగృహంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణం లోని 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్ భువనే శ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి,ప్రజల సమస్య లు,పార్టీ కార్యకలాపాలపై సంక్షిప్తంగా చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గం లో చేపడుతున్న అభివృద్ధికార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పర్యటన కొనసాగిస్తున్న భువనేశ్వరికి స్థానిక నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments