EPAPER
Thursday, August 20, 2026
Google search engine

కుప్పం తహసీల్దార్ పదవీ బాధ్యతలు చేపట్టిన రమేష్‌బాబు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 09:

 

చిత్తూరు జిల్లా కుప్పం మండల నూతన తహసీల్దార్‌గా పి.రమేష్‌బాబు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పూతలపట్టు తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయనను ప్రభుత్వం కుప్పం తహసీల్దార్‌గా నియమించింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నూతన తహసీల్దార్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ పనితీరు, పెండింగ్ దరఖాస్తులు, ప్రజా సమస్యలు, భూ సంబంధిత అంశాలు వంటి వాటి పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, భూ రికార్డుల నిర్వహణ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తాన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!