EPAPER
Sunday, March 8, 2026
Google search engine

కుప్పం డిగ్రీ కళాశాలలో ఘనంగా 16వ వార్షికోత్సవం

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,మార్చి 01:

 

కుప్పం డిగ్రీ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీఎన్ విద్యాసంస్థల అధ్యక్షులు బీసీ నాగరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన అతిథులు కళాశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. గత 16 సంవత్సరాలుగా కళాశాల విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తూ మంచి ఫలితాలు సాధించిందని కొనియాడారు. నాక్ ప్రమాణాలతో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో కళాశాల కృషి ప్రశంసనీయమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ కళాశాల మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కళాశాల వైస్ చైర్మన్ సాగర్ రాజు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!