EPAPER
Friday, September 4, 2026
Google search engine

కాలువ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి 20వ వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన కౌన్సిలర్‌ సోమశేఖర్‌

📰 Generate e-Paper Clip

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు29:

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 20వ వార్డులో పెద్ద కాలువపై కప్పు నిర్మాణం, డ్రెయిన్‌ పనులను 20వ వార్డు కౌన్సిలర్‌, 10వ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌. సోమశేఖర్‌ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌ మాట్లాడుతూ కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పనుల కారణంగా స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అనంతరం వార్డులోని స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలువ, డ్రెయిన్‌ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ వార్డులో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో 20వ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీధర్‌, కేవీ శ్రీనివాసులు, మాజీ వార్డు సభ్యుడు వెంకటరమణ, యశ్వంత్‌, హేమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!