EPAPER
Sunday, March 8, 2026
Google search engine

ఐడిపిఎస్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు…

📰 Generate e-Paper Clip

 

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 07:

 

 

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో యూకేజీ గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.వి గ్రూప్స్ అధినేత బి.ఎం దయానిధి, ఐడిపిఎస్ డైరెక్టర్ బి. లోహిత కృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.వి గ్రూప్స్ అధినేత బి.యం దయానిధి మాట్లాడుతూ… చిన్నారుల విద్యాభ్యాసంలో ప్రారంభ దశ ఎంతో ముఖ్యమని, ఈ దశలో పొందిన విలువలు వారి భవిష్యత్ విద్యా ప్రయాణానికి బలమైన పునాది అవుతాయని అన్నారు. పిల్లల ప్రతిభను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ముగింపులో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ క్యాప్స్ ధరింపజేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఐడిపిఎస్ టీచర్స్, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!