
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 06:
శ్రీకాళహస్తి ఐసీడీఎస్ శ్రీకాళహస్తి ప్రాజెక్టు పరిధిలో ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్‌మెంట్ అంశం పై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. తొట్టంబేడు,శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతం, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు పూడి గ్రామంలోని వైసీ పాఠశాల, శ్రీకాళహస్తిలోని జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల, బాబు అగ్రహారం పాఠశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సీడీపీఓ శాంతిదుర్గా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొట్టంబేడు పీహెచ్‌సీ వైద్యులు, సీహెచ్‌ఓలు రిసోర్స్ పర్సన్లుగా పాల్గొన్నారు. పిల్లల్లో దీర్ఘకాలిక అభివృద్ధి లోపాలను ఎలా గుర్తించాలి, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎర్లీ ఇంటర్వెన్షన్‌ను ఏ దశలో ప్రారంభించాలి వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్చువల్ శిక్షణ అందించారు. అదేవిధంగా నవచేతన యాప్ వినియోగం, అంగన్వాడీ పిల్లల్లో అభివృద్ధి లోపాల గుర్తింపు, డేటా నమోదు, సింక్రనైజేషన్ విధానాలపై సూపర్ వైజర్లు మరియు రిసోర్స్ పర్సన్లు కార్యకర్తలకు వివరించారు. శాఖాపరమైన మార్గదర్శకాలను తెలియజేస్తూ యాప్ సమర్థ వినియోగంపై అవగాహన కల్పించారు. 0నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని అత్యంత కచ్చితంగా అంచనా వేయడంలో ఈ నూతన ఏ.ఐ సాంకేతికత ఎంతో ఉపయోగకరమని శాంతి దుర్గా తెలిపారు. పిల్లల ఎదుగుదలలో ఉన్న లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, సత్వర చర్యలు చేపట్టేందుకు క్షేత్రస్థాయి అంగన్వాడీ కార్యకర్తలను సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.


Recent Comments