EPAPER
Thursday, August 20, 2026
Google search engine

ఎస్సీ వర్గీకరణ, క్రీమిలేయర్ విధానానికి వ్యతిరేకంగా 19న ధర్నా

📰 Generate e-Paper Clip

పీలేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 17:

 

ఎస్సీ వర్గీకరణ నిర్ణయం,ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల జెండాలతో చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపు నిచ్చారు. పీలేరు మండలం బాలంవారి పల్లి పంచాయతీ నాలెవాండ్లపల్లిలో మాల మహానాడు మండల ప్రచార కార్యదర్శి అర్పింటి రెడ్డెప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల ధరణ్ కుమార్ మాట్లాడుతూ…, సుప్రీం కోర్టు తీర్పుల పేరుతో రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత ఐక్యతకు భంగం కలుగుతుం దని, క్రీమిలేయర్ అమలు ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కు తీవ్ర ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 19న మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాల యం ఎదుట పెద్ద ఎత్తున నల్లజెండాలతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో ఉమ్మడి జిల్లాల మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, మేధావులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉప్పు ఆనంద్, మంచూరి కృష్ణయ్య, సిద్ధయ్య, చిన్నక్క, రుక్మిణి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!