
మైదుకూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 15:
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి పుట్టా పోలమ్మ మృతికి ఖాజీపేట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. పొద్దుటూరులోని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నివాసానికి చేరుకున్న నాయకులు పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన తనయుడు, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌లను కలిసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్పు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కూడా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట మండల టీడీపీ సీనియర్ నాయకులు సందుల నాగశివారెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ ఇట్టెం శ్రీరాముల యాదవ్, శ్రీనివాసపురం పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ యాదవ్, డీలర్ సుబ్బారెడ్డి, లక్కు పుల్లారెడ్డి, మామిళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Recent Comments