EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఉచిత వేసవిబడి విద్యార్థులకు అన్ని అంశాలపై తర్పీదు

📰 Generate e-Paper Clip

హిందూపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,31:

 

హిందూపురం పట్టణం త్యాగరాజ నగర్ లోగల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో కొనసాగుతున్న 28 వ సంవత్సరం ఉచితవేసవిబడి విద్యార్థులకు మే నెల1నుంచి 31వ తేదీ వరకు అన్ని అంశాలపై తర్పీదు ఇచ్చినట్లు నిర్వాహకులు కె.సాయికళ-కె.మాళప్ప దంపతులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యలక్ష్మి ఫ్లవర్ డెకరేషన్ నాగరత్న మోహన్ కుమార్ దంపతుల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత వేసవిబడి విద్యార్థులకు బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరపున యోగా మాస్టర్లు శ్రీనివాస రెడ్డి, నళినాక్షి ,సుబ్రమణ్యం ,ఆనంద్ నాగిరెడ్డి విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించారు. అదే విధంగా డ్రాయింగ్ మాస్టర్ శ్రీశైలం విద్యార్థులకు చిత్రలేఖనంలో తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు నృత్యాలు, కంప్యూటర్ విద్యలలో మాస్టర్ సాయి శిక్షణ ఇవ్వడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్ రామచంద్ర నేతృత్వంలో విద్యార్థులకు కరాటే శిక్షణలో మెలుకువలు నేర్పారు. ఇవే కాక చక్కని దస్తూరి, ఆట పాటలతో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడంతో వారి భవిష్యత్తుకు బాటలు వేశామనే తృప్తి కలిగిందని నిర్వాహుకుడు కె.మాళప్ప తెలిపారు. వీరే కాక ఉపాధ్యాయులు సాయికళ, మమతా,గాయిత్రి,కుమారి విద్యార్థుల పట్ల చూపిన ఆదరాభిమానాలు ఎనలేనివన్నారు. ఇక ఆదివారం పట్టణంలోని ఎస్.ఆర్.జెరాక్స్ యజమాని గిరి కుమార్ రెడ్డి అందించిన నోట్ పుస్తకములు పంపిణీ చేశారు. పట్టణంలో ఉన్న ప్రముఖ సింధూర్ హోటల్ యాజమాన్యం శ్రీనివాసులు విద్యార్థులకు అన్నదానం చేశారు. వివిధ రకముల శిక్షణలో విద్యనేర్పిన మాస్టర్లకు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన దాతలకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. *నేడు వేసవిబడి ముగింపు సమావేశం– విద్యార్థులకు ధృవ పత్రాలు పంపిణీ* మే నెల 1 నుంచి నిర్వహించిన 28 వ సం. ఉచిత వేసవిబడి విద్యార్థులకు సోమవారం ముగింపు సమావేశం నిర్వహించి విద్యార్థులకు ధృవ పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు కె.మాళప్ప తెలిపారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పట్టణ ప్రజలు హాజరై పేద విద్యార్థులను ఆశీర్వదించాలని నిర్వాహకులు కె మాళప్ప కోరారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!