EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఎనభై మందికి పరీక్షలు  పన్నెండు మందికి ఉచిత శస్త్రచికిత్స అవకాశం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే09:

 

కుప్పంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ ఆధ్వర్యంలో పి.ఈ.ఎస్ ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం శనివారం విజయవంతంగా జరిగింది. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మొత్తం ఎనభై మందికి ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి చూపు సమస్య తీవ్రంగా ఉన్న పన్నెండు మందిని ఉచిత శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు. స్వల్ప దృష్టి లోపం ఉన్న వారికి కంటి అద్దాలు వినియోగించాలని వైద్యులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ జిల్లా విభాగ అధ్యక్షుడు, సలహాదారు మహేష్ అంబా, ఉపాధ్యక్షుడు సెల్వం మాట్లాడుతూ.. వృద్ధులకు కంటి చూపు ఎంతో ముఖ్యమని తెలిపారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరమని సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రతి నెల రెండో శనివారం ఉచిత కంటి మరియు మధుమేహ వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ లయన్స్ క్లబ్ తరఫున భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రసాద్, జయరాం నాయుడు, ఏకాంబరం, వైద్యుడు వరదరాజులు, పి.ఈ.ఎస్ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!