EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు 

📰 Generate e-Paper Clip

వి.కోట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 09:

 

వి.కోటపట్టణంలోని బస్టాండ్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం,రిలయన్స్ ట్రెండ్స్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ ఎడమ కాలు విరిగిపోగా,భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు శాంతిపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుప్పంలోని పీఈఎస్ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సును పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.కాగా,వి.కోట పట్టణంలో రహదారులపై వాహనాల అస్తవ్యస్త పార్కింగ్, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!