EPAPER
Saturday, April 18, 2026
Google search engine

ఆర్టీఐ-ఏఎస్ జాతీయ డైరెక్టర్‌గా ఎం.చక్రపాణి,  రాష్ట్ర డైరెక్టర్‌గా ఎం.నారాయణ స్వామి నియామకం

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:

 

సమాచారహక్కు చట్టం–2005కు అనుసంధానంగా పనిచేస్తున్న ఆర్టీఐ-ఏఎస్ సంస్థలో జాతీయడైరెక్టర్‌గా ఎం. చక్రపాణి (ఐడి: ఆర్టీఐ-ఏఎస్243/20/151), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఎం. నారాయణ స్వామి (ఐడి: ఆర్టీఐ-ఏఎస్243/20/152) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎం. చక్రపాణి మాట్లాడుతూ.., సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలకు న్యాయం చేకూర్చే దిశగా కట్టుబాటుతో పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల హక్కులు, పారదర్శకత, బాధ్యత, న్యాయం సాధన కోసం నిరంతరం శ్రమించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నియామకాల సందర్భంగా మిత్రులు, కుటుంబ సభ్యులు మరియు ఆర్టీఐ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేయగా, అందరికీ ఎం. చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!