EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

అమ్మ చరణధూళి బిడ్డలం—-మంజుల పత్తిపాటి

📰 Generate e-Paper Clip

భువనగిరి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 30:

 

నీ పాద ధూళి పుప్పొడి రేణువులం మేము..! నీ కరుణామృత సింధు తరంగములం మేము..! నీ కరస్పర్శ సౌభాగ్యమున సవరం చేసి… మలిన చిత్తాంబుజమున మణిదీపమై వెలుగు తల్లి..! దేహమే దేవాలయమని వేదం గానమాడగా… దేహాన్నే భారమని భావించి తిరుగుతున్నాం..! అంతరాలయంలో కొలువైన దేవుణ్ణి మరచి… అలంకారాల గర్భంలో ఆత్మను దాచుకున్నాం..!ప్రేమయే పరమపదమని నీ పలుకులు పలికినా… పగలనే పూజించి ద్వేషాన్ని హృదయంలో నిలిపుకున్నాం..!కరుణయే కైలాసమని నీ చూపులు బోధించినా… కఠినత్వపు శిలలతో మనసును ముసుగు చేసుకున్నాం..!నీ దయా జలధార ఒక చుక్క తాకగానే… ఎండిన ఆశల నేలలో ఆనంద మొగ్గలు తొడిగెను..! నీ నామస్మరణ ఒకసారి పలికగానే… అజ్ఞానాంధకార గుహలలో జ్ఞానసూర్యుడు ఉదయించెను..! తల్లి…! నీ పాదసేవలో పర్యావరణ పరిరక్షణ పూజగా మారాలి..! నీ ఆశీస్సులతో ఆరోగ్య జీవనం యోగంగా వికసించాలి..! ప్రకృతి, ప్రాణం, పరమాత్మ — ఈ త్రివేణి సంగమమే జీవన సార్థకత అని చెప్పిన మంజుల పత్తిపాటి కలం భక్తి పుష్పాంజలి సమర్పించే. రచన: మంజుల పత్తిపాటి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం చరవాణి 9347042218

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!