EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

అమరావతి రాజధానికి మద్దతుగా గ్రీన్ వ్యాలీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల వినూత్న కార్యక్రమం

📰 Generate e-Paper Clip

రామకుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 02

 

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా గురువారం రోజు గ్రీన్ వ్యాలీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేకంగా ఆనందోత్సవాలు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు “అమరావతి” అనే ఆకారంలో కూర్చొని తమ మద్దతును వినూత్నంగా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతీశ్వర్ గాంధీ మాట్లాడుతూ… “అమరావతి మన రాష్ట్ర అభివృద్ధికి ప్రతీక. విద్యార్థుల్లో రాష్ట్ర పట్ల బాధ్యతాభావం పెంపొందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. మొత్తం కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!