శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:
శ్రీకాళహస్తి మహాశివరాత్రి లో భాగంగా 8వ రోజైన పల్లకి సేవ రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా గతంలో మా సంఘ పెద్దలు దేవుడి పెళ్లి రోజున కొన్ని వందల పేదలందరికీ తాళిబొట్లు పంపిణీ కార్యక్రమం జరిగేదని దాని కొనసాగింపుగా ప్రస్తుతం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం లో మా సంఘం ముందుంటుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ పెద్దలు వై వి రమణయ్య ముదిరాజ్ తోటకూర కోటేశ్వరరావు ముదిరాజ్ ఆకుల గురుమూర్తి ముదిరాజ్ కోనేటి అయ్యప్ప ముదిరాజ్ మణి ముదిరాజ్ వెళ్లారి అమరావతి ముదిరాజ్ పిల్లారి బత్తినయ్య ముదిరాజ్ ఆకుల సునీత ముదిరాజ్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments