EPAPER
Monday, March 9, 2026
Google search engine

అందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు విజయవంతం. ప్రభుత్వ అధికారులకు ఘనంగా సన్మానం. శ్రీదుర్గా వీరభద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఆలయ చైర్మన్ రమా నందన్ సన్మానించిన డియస్పీ -తాహసిల్దార్.

📰 Generate e-Paper Clip

హిందూపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:

లేపాక్షి దుర్గాదేవి, వీరభద్ర ఆలయంలో ఈనెల 14 నుండి 18 వ తేది వరకు జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా ముగిసాయని ఆలయ చైర్మన్ కరణం రమానందన్ పేర్కొన్నారు. శనివారం మద్యాహ్నం దేవాలయం ఆవరణం నందు ఉద్యోగులు, సేవాకర్తలకు చైర్మన్ అధ్యక్షతన ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఈ ఏడాది ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ సౌజన్యంతో పెద్ద ఎత్తున ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు, శివపార్వతుల బ్రహ్మరథోత్సవం, శివపార్వతుల కల్యాణోత్సవం, పూలపల్లకి, చండిహోమము తదితర కార్యక్రమాలు విజయవంతం కావడానికి అధికారలు, సేవాకర్తలు విశేషంగా కృషి చేసారని తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించే ముందుకు నడపడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం హిందూపురం డియస్పీ మహేష్, ఈఓ నరసింహమూర్తి, తహసిల్దార్ జి.సౌజన్యలక్ష్మి, ఎంపిడిఓ నరసింహమూర్తి, సీఐలు రాజగోపాల్నాయుడు, జనార్దన్, ఆంజనేయులు, కరీం, యస్ఐలు మునీర్అహమ్మద్, నరేంద్ర, ఏఓ శ్రీలత, ఏఈ వెంకటేశులు, డాక్టర్ రాజ్ కుమార్, ఏపి టూరిజం మేనేజర్ లక్ష్మణరావు ఆలయ అర్చకులు లక్ష్మీనరసింహ శర్మ శ్రీనివాస్ కుమార్ శర్మ వారి సిబ్బందికి చైర్మన్ చేతులు మీదుగా సన్మానించి ప్రత్యేకంగా చేయించిన నంది మెమొంటోను జ్ఞాపకంగా అందజేయడం జరిగింది. అనంతరం అధికారులు అందరు కలిసి శివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించిన చైర్మన్ రమా నందన్ ఘనంగా సత్కరించారు. అనంతరం డియస్సీ, సిఐ, తహసిల్దార్లు మాట్లాడుతూ ఎప్పుడు లేనివిధంగా ఈసారి ఉత్సవాల ఏర్పాల్లు చేసారని, ఆలయంలో భక్తులకు ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు అందించడమే కాకుండా ఆలయ ఆవరణంలో అన్నప్రసాదం పంపిణి చేయడం గొప్ప విషయమన్నారు. ఇంతటీ ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అందరు బాధ్యతగా పనిచేయడం ఆనందంగా వుందన్నారు. భవిష్యత్లో ఎలాంటి అధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టిన ప్రోత్సాం అందిస్తామన్నారు. అనంతరం లేపాక్షి పాత్రికేయులు, పంచాయితీ కార్మికులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక పూల అలంకరణ ఎలక్ట్రికల్ ఏర్పాట్లు సహాయ సహకారాలు అందించిన మిత్రమండలిని ఘనంగా సన్మానించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!