chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 5:00 am Digital Edition : CHITTOORE EXPRESS

9వ వార్డులో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కడ అడ్వైజర్ ఎస్. రాజ్‌కుమార్

కుప్పం, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 28:

 

కుప్పం మున్సిపాలిటీ 9వ వార్డులో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కడ అడ్వైజర్ ఎస్. రాజ్‌కుమార్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రెండు చుక్కల పోలియో మందు చిన్నారులకు జీవితకాల రక్షణ కల్పిస్తుందని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికటిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.