
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 01:
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 10వ క్లస్టర్ 26వ వార్డులో గురువారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో 20వ వార్డుగా ఉన్న ఈ ప్రాంతం వార్డుల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం 26వ వార్డుగా మారింది. ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం-ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ చొరవతో పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించడంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కీలకంగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుధీర్, కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, సీనియర్ నాయకుడు గోపినాథ్, 10వ క్లస్టర్ ఇన్చార్జి, 20వ వార్డు కౌన్సిలర్ ఎస్. సోమశేఖర్, యూనిట్ ఇన్చార్జి కే.ఎం. వేణుగోపాల్, 20వ వార్డు 167వ బూత్ ఇన్చార్జి కే. లోకేష్ బాబు, నాయుడు, టీ. సురేష్, వి.కె.ఎం. రాజా, వెంకటేష్, కరుణ, దేవా తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు, యూనిట్, కో-యూనిట్, బూత్ ఇన్చార్జిలు, కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.