
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 10:
చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్‌ను 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు పట్టణంలోని పోలీస్ గెస్ట్ హౌస్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2003 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) వర్తింపజేస్తూ, కేంద్ర ప్రభుత్వ మెమో–57ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 21 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సమస్యకు పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ తుషార్ డూడికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) శ్రీమతి ఎస్. షాను, 2004 బ్యాచ్‌కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.