chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 1:35 pm Digital Edition : CHITTOORE EXPRESS

19వ వార్డులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవగాహన కార్యక్రమం

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే24:

 

చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ జిమ్ దాము ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా 19వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలు, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త సేకరణ విధానాన్ని వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి వార్డులో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెస్పో డైరెక్టర్లు, బూత్ ఇన్చార్జులు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.