12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అవగాహన కార్యక్రమం
తొట్టంబేడు
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామ పంచాయతీలో యోగా దినోత్సవ వేడుకలు పంచాయతీ గ్రామ అభివృద్ధి అధికారి శాంతి ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ఆదివారం నిర్వహించారు. గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ,చిట్టత్తూరు ప్రభుత్వపాఠశాల నందు యోగ ఆసనాలు వేసి, యోగా వ్యాయామలు చేశారు, అనంతరం ముఖ్య అతిథులు యోగ ఆసనాల వల్ల జరిగే పలు ప్రయోజనాలను అవగాహన కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిట్టత్తూరు గ్రామ అభివృద్ధి అధికారి శాంతి మాట్లాడుతూ జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంతో ఘనంగా తమ గ్రామం నందు నిర్వహించామని. ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ వయసుతో పాటు ఆరోగ్యానికి యోగా అనే ప్రత్యేక ఇతివృత్తంతో విజయవంతంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహింపబడుతున్నాయని యోగ అనేది భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఒక ప్రాచీన జీవన విధానమని. ఇందులో శారీరక ఆసనాలు, శ్వాస ప్రక్రియలు ప్రాణాయామం , మానసిక క్రమశిక్షణ, ధ్యానం వంటి ఎన్నో అంశాలు కలిసి ఉంటాయని. యోగా అనే పదం సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. దీనికి కలయిక సంధింపజేయడం అని అర్థం. అంటే శరీరం, మనస్సు, ఆత్మను ఒకే తాటిపైకి తెచ్చి అంతర్గత చైతన్యాన్ని రగిలించడమే యోగా. కాలక్రమేణా ఈ అద్భుత ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించిందని. ప్రతినిత్యం యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంమేకాక శారీరక దృఢత్వo మానసిక ప్రశాంతత, భావోద్వేగ స్థిరత్వం సాధించడం.ఒత్తిడి నివారణ ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచడం.వ్యాధుల నివారణ మధుమేహం రక్తపోటు థైరాయిడ్ , వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడం.ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాచీన భారతీయ యోగ విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనం పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
