chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:44 am Digital Edition : CHITTOORE EXPRESS

11వ క్లస్టర్‌లో తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశాలు..  పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 03:

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు సూచనలతో కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశాలు నిర్వహించారు. 11వ క్లస్టర్ ఇన్‌చార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచడం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 11వ క్లస్టర్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో యూనిట్ ఇన్‌చార్జ్ సుబ్రమణి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ కన్నన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ కార్యక్రమాల అమలుపై చర్చించారు. అలాగే మోడల్ కాలనీలో యూనిట్ ఇన్‌చార్జ్ సుభాన్ బాబు ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, రానున్న కార్యక్రమాల నిర్వహణపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. సమావేశాల్లో బూత్ ఇన్‌చార్జిలు, కో-బూత్ ఇన్‌చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.