chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 9:17 pm Digital Edition : CHITTOORE EXPRESS

100 కిలోల లడ్డుతో వినాయకుడి ప్రతిమ కొత్తపేటలో ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వినాయకుడు

 

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 15:

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో న్యూ పెట్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సుమారు 100 కిలోల లడ్డూతో వినాయకుడి ప్రతిమను రూపొందించి మండపంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూతో రూపొందించిన వినాయకుడి ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామివారిని దర్శించుకునేందుకు కొత్తపేటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.